Sat Mar 14 2026 10:00:22 GMT+0530 (India Standard Time)
Hyderabad : తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం వెనక?
తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు 84.15 కోట్ల రూపాయల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు, ఎస్కేజీ ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రైటర్ సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు గుర్తించారు.
ఇతర సంస్థల్లోనూ...
సందీప్‌కు సంబంధమున్న ఇతర సంస్థల్లోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈక్రమంలో వాటి రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. సందీప్‌ను జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణంపై అధికారులు ఆరాతీస్తున్నారు. ఇంకా ఎన్ని ఇలాంటి కుంభకోణాలు చోటు చేసుకున్నాయన్న అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
Next Story

