Tue Dec 16 2025 02:05:20 GMT+0000 (Coordinated Universal Time)
సచివాలయం ముట్టడి - అనుమతి లేదన్న పోలీసులు
సచివాలయం ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపు నిచ్చింది

సచివాలయం ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపు నిచ్చింది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్డడికి పిలుపు నిచ్చింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్ నగరంలో ఉన్న సమయంలో నిరుద్యోగ జేఏసీ ముట్టడికి పిలుపు నివ్వడంతో ఉత్కంఠ నెలకొంది.
నోటిఫికేషన్ విడుదల చేయాలని...
సచివాలయం ముట్టడికి, ఎటువంటి నిరసనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇప్పటికే జిల్లాల్లో పలువురు నిరుద్యోగ జేఏసీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లలో అందరినీ తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.
Next Story

