Thu Apr 02 2026 00:44:04 GMT+0530 (India Standard Time)
బీటెక్ అమ్మాయి.. పొలానికి పనికి వెళ్ళింది
గణేష్ చతుర్థి పండుగ సెలవుల కారణంగా ఇంటికి వెళ్లిన బీటెక్ తృతీయ సంవత్సరం విద్యార్థినిని

గణేష్ చతుర్థి పండుగ సెలవుల కారణంగా ఇంటికి వెళ్లిన బీటెక్ తృతీయ సంవత్సరం విద్యార్థినిని తేలు కుట్టడంతో మృతి చెందింది. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులలోనూ, బంధువులలోనూ ఊహించని విషాదాన్ని నింపింది. మరణించిన మాలతి మధ్యతరగతి కుటుంబానికి చెందినది. బాగా చదువుకుని కుటుంబానికి అండగా నిలవాలని అనుకున్న మాలతి నిండు నూరేళ్ళ జీవితాన్ని తేలు కాటు కబళించి వేసింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధి లోని రగుడులో తేలు కాటుతో దొంతుల మాలతి (21) అనే యువతి మృతి చెందింది. హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న మాలతి ఇటీవలే ఇంటికి వచ్చింది. వ్యవసాయ పనుల కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. ఆమె ఓ షర్ట్ వేసుకొని పనులు చేస్తుండగా తేలు కాటుకు గురైంది. అప్పటికే ఆ షర్టు లోపల ఉన్న తేలు పలుచోట్ల కాటు వేయడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులపాటు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.
Next Story

