Mon Feb 17 2025 10:50:22 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఫెయిలైన వారు ...
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సుమారు నాలున్నర లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలైన వారితో పాటు ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నించేవారు ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. పరీక్ష ఫలితాలు వెలువడనుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలయింది.
Next Story