Wed Mar 18 2026 21:39:51 GMT+0530 (India Standard Time)
నేడు భద్రాద్రికి తెలంగాణ గవర్నర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ నేడు ఖమ్మం జిల్లాలోని భద్రాద్రిలో పర్యటించనున్నారు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ నేడు ఖమ్మం జిల్లాలోని భద్రాద్రిలో పర్యటించనున్నారు. ఈరోజు భద్రాచలంలోని సీతారామ చంద్ర దేవస్థానాన్ని సందర్శించి ఆలయంంలో ప్రత్యేకించి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కవులు, కళాకారులతో కూడా ఆయన సమావేశం కానున్నారు.
సీతారామ స్వామిని దర్శించుకుని...
నిన్ననే భద్రాచలం చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు అధికారులు స్వాగతం పలికారు. ఆయన రాత్రి అక్కడే బస చేశారు. రాత్రికి బూర్గంపాడు మండలంలోని సారపాకలోని ఐటీసీ అతిధి గృహంలో బస చేసిన గవర్నర్ ఈరోజు ఉదయం భద్రాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

