Mon Jun 23 2025 03:19:00 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రేషన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్...అదిరిపోయే న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ సరుకుల పంపిణీ సమయాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ సరుకుల పంపిణీ సమయాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి తెలంగాణలో రేషన్ దుకాణాలలో ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒకేసారిమూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. రానున్న మూడు నెలలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశమున్నందున మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో ఒక్కొక్క రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుడికి పద్దెనిమిది కేజీల బియ్యాన్ని అందిస్తుంది. కుటుంబంలో ఎంత మంది ఉన్నప్పటికీ అన్నిపద్దెనిమిది కేజీల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.
మూడు నెలలకు ఒకేసారి ఇస్తుండటంతో...
అయితే ఒకేసారి రేషన్ బియ్యం ఇస్తుండటంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకూ క్యూ లైన్ లతో పడిగాపులు పడుతున్నారు. అనేక మంది జాగారం చేయాల్సి వస్తుంది. తీరా తమ వంతుకు వచ్చేసరికి స్టాక్ అయిపోతుండటంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఈ నెల 30వ తేదీ వరకూ రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని, అందరికి పంపిణీ చేయడానికి సరిపడా స్టాక్ రేషన్ దుకాణాల వద్ద ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేషన్ కార్డులున్న వారందరికీ మూడు నెలలకు సరిపడా సన్న బియ్యాన్ని అంందచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది.
గడువు పెంచడంతో...
రేషన్ సరుకులను ఇచ్చే గడువును పెంచిన కారణంగా కొంత రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మొత్తం 90 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. అందులో మూడుకోట్ల మందికి సన్నబియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. ప్రతినెల రేషన్ దుకాణాలకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తుంది. ఎక్కడా బియ్యం కొరత అంటూ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డులు వస్తే మరో ముప్ఫయి లక్షల మంది లబ్దిదారులు పెరిగే అవకాశముంటున్నారు. ఈ సన్నబియ్యం పథకం కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 10,615 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. రద్దీని తగ్గించేందుకు, అందరికీ రేషన్ బియ్యం అందేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story