Fri Dec 05 2025 11:30:55 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కేసీఆర్ పుట్టినరోజు నాడు.......
దీంతో ఆయన ఇంటివద్దనే పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ ఈరోజు 68వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. గత ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమీ లేదని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈరోజు నరిసనలు తెలియజేయాలని పిలుపునివ్వడంతో రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు బ్యారికేడ్లు నిర్మించారు. పెద్దయెత్తున పోలీసు బలగాలను మొహరించారు.
Next Story

