Sat Mar 21 2026 03:15:30 GMT+0530 (India Standard Time)
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం రెండుగంటలకు ప్రగతి భవన్ లో జరగనుంది.

తెలంగాణ ష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం రెండుగంటలకు ప్రగతి భవన్ లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులపై చర్చ జరగనుంది. దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణతో పాటు, రేపు పార్టీ సమావేశంపై కేసీఆర్ మంత్రివర్గ సభ్యులతో చర్చించనున్నట్లు తెలిసింది.
ఎన్నికల ఏడాది కావడంతో...
ఎన్నికలే ఈ ఏడాది జరుగుతుండటంతో పలు కార్యక్రమాల అమలుపై కూడా చర్చించనున్నారని తెలిసింది. దళిత బంధు, గిరిజన బంధు అమలుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి మూడు లక్షల ఆర్థిక సాయం అందించే పథకంపై కూడా మంత్రి వర్గంలో చర్చించనున్నారు. ఈ పధకానికి సంబంధించి విధివిధానాలపై మంత్రులతో చర్చిస్తారు.
Next Story

