Thu Mar 19 2026 02:41:38 GMT+0530 (India Standard Time)
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 77 రోజులు సెలవులు
ఈ మేరకు 2023-24 అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 365 రోజులకు గాను 227 రోజుల పాటు..

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. 2023-24 అకడమిక్ ఇయర్ లో విద్యార్థులకు 77 రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2023-24 అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 365 రోజులకు గాను 227 రోజుల పాటు తరగతులు జరుగుతాయని వివరించింది. జూన్ 1వ తేదీ నుంచి నూతన తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది.
పండుగలు, ఆదివారాలు, వేసవి సెలవులు ఇలా మొత్తం కలిపి 77 రోజులపాటు విద్యార్థులకు సెలవులివ్వనున్నట్లు వివరించింది. ఈ సెలవుల్లో అక్టోబర్19 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఇక ఫిబ్రవరి 2వ వారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డ్ పేర్కొంది.
Next Story

