Sun Dec 14 2025 00:26:14 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : హైవేవై వెళుతున్న వారికి ఇక గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి వివిధ రకాలైన ప్రయత్నాలను ప్రభుత్వం మొదలు పెట్టింది. అందులో భాగంగా జాతీయ రహదారులపై పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసి వాటిని అమలు చేయనున్నాయి.
అన్నీ అక్కడేనట...
ముఖ్యంగా జాతీయ రహదారిపై పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక రిసార్ట్, పిట్ స్టాప్‌లు, విశ్రాంతి గదులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, రైతుల ఆహారశాలలు, మోటల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. స్థానిక వంటకాలు, హస్తకళలను ఈ మోటల్స్ లో ఏర్పాటు చేసి వాటిని ప్రోత్సహించనుంది. ఇది అమలులోకి వస్తే తెలంగాణ పర్యాటకం మరింత అభివృద్ధి చెందనుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.
Next Story

