Thu Jan 15 2026 13:57:03 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మరో ఇద్దరి ఎమ్మెల్యేలకు ఊరట
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పు చెప్పారు

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పు చెప్పారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ అనర్హత పై తీర్పు రిజర్వ్ లో ఉంచారు.
పార్టీ మారారన్న దానికి...
నేడు పార్టీ మారారంటున్న కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించి అనర్హత పిటీషన్ పై విచారణ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాదరావు తన నిర్ణయాన్ని ప్రకటించారు. వీరిద్దరూ పార్టీ మారారనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని గడ్డం ప్రసాదరావు చెప్పారు. ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకూ పది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాదరావు క్లీన్ చిట్ ఇచ్చారు.
Next Story

