Thu Mar 19 2026 22:27:11 GMT+0530 (India Standard Time)
స్పీకర్ కు మరోసారి పాజిటివ్
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి కరోనా సోకింది. ఇటీవలే కరోనా సోకడంతో చికిత్స పొంది బయటకు వచ్చారు

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి కరోనా సోకింది. ఆయన ఇటీవలే కరోనా సోకడంతో చికిత్స పొంది బయటకు వచ్చారు. రెండోసారి ఆయనకు కరోనా సోకింది. నిన్న స్వల్ప లక్షణాలు కన్పించడంతో పోచారం శ్రీనివాసరెడ్డి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది.
ఆసుపత్రిలో చికిత్స...
అయితే పోచారం శ్రీనివాసరెడ్డి వైద్యుల సూచన మేరకు గచ్చిబౌలిలోని ఐఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. తనను కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. తన ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
Next Story

