Sat Mar 07 2026 11:24:54 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేడు ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారించనున్నారు

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేడు ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారించనున్నారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ విచారణ జరిపారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ ల అనర్హత పిటీషన్ లపై విచారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. ఇటీవల కడియం శ్రీహరి అనర్హత పిటీషన్ పై విచారణ జరిగింది.
ఇప్పటికే ఎనిమిది మంది...
నేడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటీషన్ పై స్పీకర్ విచారణ చేయనున్నారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్ పై విచారించాలని సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిటీషన్ వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విచారణలో వేగవంతం చేశారు. పది మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే స్పీకర్ ఎనిమిది మంది పార్టీ మారినట్లు ఆధారాలు లభించలేదనితెలిపారు.
Next Story

