Fri Feb 14 2025 18:27:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాకింగ్ న్యూస్
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మందికి నోటీసులు జారీ చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి మారిన పది మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టులో ఈ నెల పదో తేదీన విచారణ ఉండటంతో అసెంబ్లీ సెక్రటరీ ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో...
సుప్రీంకోర్టులో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గులాబీ పార్టీ నేతలు పిటీషన్ వేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే మొన్న దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎంతకాలం దీనిపై వేచిచూడాలని ప్రశ్నించింది. తిరిగి ఎన్నికలు జరిగే వరకూ నిర్ణయించరా? అని కూడా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని ప్రశ్నించడంతో నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటీసులు ఇచ్చారు. వివరణ ఇచ్చేందుకు తమకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు.
Next Story