2023 -24 విద్యా క్యాలెండర్ విడుదల.. సెలవుల వివరాలివే
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మంగళవారం 2023-24 సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూన్ 12న

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మంగళవారం 2023-24 సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూన్ 12న పునఃప్రారంభమయ్యే పాఠశాలలకు ఏప్రిల్ 23, 2024 చివరి పనిదినంతో మొత్తం 229 పనిదినాలు ఉంటాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 'బడి బాట' (అడ్మిషన్ డ్రైవ్) జూన్ 9 వరకు నిర్వహించబడుతుంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. సంక్రాంతి సెలవులు 2024 జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయి. 2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది అన్ని తరగతుల్లో 5 నిమిషాలపాటు యోగా సెషన్ కోసం కేటాయించనున్నారు
10వ తరగతి సిలబస్‌ను 2024 జనవరిలోపు పూర్తి చేసి, ఆ తర్వాత ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ కోసం రివిజన్ క్లాసులు, ప్రీ ఫైనల్ పరక్షలు నిర్వహించనున్నారు. ఫార్మాటివ్ అసెస్మెంట్-1 పరీక్షలను ఈ ఏడాది జులై 31 నాటికి, ఫార్మాటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నిర్వహించనున్నారు. ఆ తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలను అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 11 వరకు నిర్వహించనున్నారు. ఇక ఫార్మాటివ్ అసెస్మెంట్-3 పరీక్షలను ఏడాది డిసెంబర్ 12 లోపు, ఫార్మాటివ్ అసెస్మెంట్-4 పరీక్షలను 2024 జనవరి 29 లోపు పూర్తిచేయనున్నారు. చివరగా సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను 2024 ఏప్రిల్ 8 నుంచి 2024 ఏప్రిల్ 18 వరకు (1 నుంచి 9 తరగతులకు) నిర్వహిస్తారు.

