Wed Feb 12 2025 08:06:07 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కార్మికసంఘాలు కోరాయి. బస్సులను కొనుగోలు చేస్తూ వాటిని ప్రయివేటువ్యక్తులకు నిర్వహణ బాధ్యతను అప్పగించడం ప్రయివేటీకరణలో భాగమేనని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. జేఏసీ ఆధ్వర్యంలో యాజమాన్యానికి నోటీసులు అందచేశాయి.
డిమాండ్లు ఇవే...
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు 2,700 కోట్ల చెల్లింపులు చేయాలంటూ తమ డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. డిమాండ్లు నెరవేర్చకుంటే తాము సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్మిక సంఘాల నేతలతో కలసి పెద్దయెత్తు కార్మికులు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.
Next Story