Wed Jan 21 2026 19:25:21 GMT+0000 (Coordinated Universal Time)
టూరిజం ప్యాకేజీలతోనే ఆదాయం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. టూరిజం ప్యాకేజీలపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. టూరిజం ప్యాకేజీలపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలను తీసుకున్న తర్వాత ఇటు గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సేవలను పెంచడంతో పాటు ఆర్టీసీ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు సజ్జనార్ ప్రయత్నిస్తున్నారు.
రామప్ప దర్శన్.....
తాజాగా తెలంగాణ ఆర్టీసీ వరంగల్ ప్రాంతంలోని రామప్ప దేవాలయం, లక్కవరం చూసి వచ్చేందుకు అవకాశాన్ని కల్పించింది. ప్రజల కోసం రామప్ప దర్శన్ పేరిట ఈ ప్యాకేజీని రూపొందించింది. సెలవు దినాలతో పాటు ప్రతి రెండో శనివారం ఈ ప్యాకేజీ కింద ప్రత్యేక బస్సులను నడుపుతారు. హనుమకొండ నుంచి ఈ సర్వీసులు ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ విషయాన్ని ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Next Story

