Sun Dec 14 2025 00:20:51 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీపై రేవంత్ ఆశలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఫ్యూచర్ సిటీని సందర్శించనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఫ్యూచర్ సిటీని సందర్శించనున్నారు. వచ్చే నెల 8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించనున్నారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచలను అధికారులకు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల సందర్భంగా భారీగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన పార్ట్ నర్ షిప్ సమ్మిట్ కు భారీ స్పందన వచ్చింది. అక్కడ పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి.
పెట్టుబడులు అధికంగా...
ఇప్పుడు తెలంగాణలో జరిగే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అంతకు మించి పెట్టుబడులు రావాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులోనూ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావవస్తుండటంతో గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతం గా పూర్తి చేసి ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలబడాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉంది. అలాగే రెండేళ్ల తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తో పాటు ప్రజా ప్రభుత్వంగా తాము తీసుకున్న నిర్ణయాలను ఈ సమ్మిట్ ద్వారా ప్రజలకు చేరవేయాలని నిర్ణయించారు. దీనివల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంత అడ్వాంటేజీ అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటూ పారిశ్రామిక విధానాలను కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు.
విజన్ డాక్యుమెంట్ ను ...
అలాగే తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను కూడా ఆవిష్కరించనున్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంతో పాటు పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ఇక్కడి నుంచి వివరించనున్నారు. అందులోనూ మరో నగరాన్ని ఈ వేదిక ద్వారా తీసుకెళ్లే ప్రయత్నమూ రేవంత్ చేస్తున్నారు. భారత్ ఫ్యూ చర్ సిటీ పేరిట తమ ఆలోచనలను ఈ వేదిక నుంచి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని అన్ని స్టార్ హోటల్స్ లో రూమ్ లను వారి కోసం ముందస్తుగా బుక్ చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు తమ ఫ్యూచర్ ప్లాన్ ను వివరించి తెలంగాణకు అదనపు సొబగులు అద్దాలన్న ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు.
Next Story

