Mon Dec 08 2025 04:00:37 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది.

నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. గ్లోబల్ సమ్మిట్ ను రెండ్రోజుల పాటు కొనసాగనుంది. మొత్తం 44 దేశాల నుంచి 154 మంది అతిథుల ఈ గ్లోబల్ సమ్మిట్ కు హాజరవుతున్నారు. మొత్తం రెండు వేల మంది కూర్చొనేలా ప్రారంభ వేదిక ఉండనుంది. మధ్యాహ్నం 1: 30 గంటలకు సమ్మిట్ ప్రారంభం కానుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయనున్నారు.
27 సెషన్లలో.. రెండు రోజుల పాటు...
తొలిరోజు ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ట్రంప్-మీడియా అండ్ టెక్నాలజీస్ నుంచి ఎరిక్ స్వేడర్ ప్రసంగాలుంటాయి. మధ్యాహ్నం 2: 30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం.. వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు జరగనున్నాయి. వివిధ అంశాలపై ఈ గ్లోబల్ సమ్మిట్ లో చర్చించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్టోపస్ బలగాలతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘాను ఉంచారు.రేపు సాయంత్రం ఆరు గంటలకు ముగింపు సమావేశం ఉంటుంది. అతిధులకు తెలంగాణ వంటకాలతో అదిరిపోయే రుచులతో విందును ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
Next Story

