Sun Mar 08 2026 02:37:11 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు..
తెలంగాణలో కరోనా కొత్తకేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముందురోజుతో పోలిస్తే ఎక్కువగా..

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కొత్తకేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముందురోజుతో పోలిస్తే ఎక్కువగా 17కొత్త కేసులు నమోదయ్యాయి. గతరాత్రి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14,265 కరోనా శాంపిళ్లను పరిక్షించగా.. 32 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ లో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మరో 20 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కొత్తగా రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం తెలంగాణలో 199 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 4,111గా ఉంది. అలాగే శుక్రవారం వరకూ తెలంగాణలో 7లక్షల 91వేల 741 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 87వేల 431 మంది కోలుకున్నారు.
Next Story

