Sun Mar 08 2026 02:37:42 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కొత్తగా 22 కేసులు.. మరణాలు సున్నా !
వీటిలో అత్యధికంగా హైదరాబాద్ లో 12 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో 24 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

హైదరాబాద్ : తెలంగాణలో రెండ్రోజులుగా రోజువారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ముందురోజు కొత్తగా 20 కేసులు నమోదవ్వగా.. మంగళవారం రాత్రి విడుదలైన కరోనా బులెటిన్ లో కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లో 14,339 శాంపిళ్లను పరీక్షించగా 22 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ లో 12 కేసులు నమోదయ్యాయి.
ఇదే సమయంలో రాష్ట్రంలో 24 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం తెలంగాణలో 187 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111గా ఉంది. మంగళవారం వరకూ రాష్ట్రంలో 7లక్షల 91వేల 672 కరోనా కేసులు నమోదవ్వగా.. 7లక్షల 87వేల 374 మంది కోలుకున్నారు.
Next Story

