Sat Dec 06 2025 02:12:46 GMT+0000 (Coordinated Universal Time)
ట్విట్టర్ లో నెంబర్ వన్ ట్రెండింగ్
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధం ఆగలేదు. వరస బెట్టి ట్విట్టర్ లో వార్ చేస్తూనే ఉంది

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధం ఆగలేదు. వరస బెట్టి ట్విట్టర్ లో వార్ చేస్తూనే ఉంది. ప్రధానిని తెలంగాణకు శత్రువుగా చూపుతూ ట్విట్టర్ లో టీఆర్ఎస్ పెట్టిన హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. mody enemey of telangana పేరిట హ్యష్్ ట్యాగ్ నెంబర్ వన్ గా నిలిచింది. గంటలోనే ఇరవై ఐదు వేల మంది ట్వీట్ చేయడం విశేషం.
హైదరాబాద్ కు....
ఇటీవల మోదీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ మోదీని వ్యతిరేకిస్తూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లో పెట్టింది. మోదీ హైదరాబాద్ వస్తే కనీసం స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల్లో కూడా కేసీఆర్ పాల్గొన లేదు. జాతీయ స్థాయిలో బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడతానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రమంతటా....
నిన్న పార్లమెంటులో తెలంగాణ ఆవిర్భావంపై మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో పాటు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై నినదించేందుకు mody enemey of telangana హ్యాష్ ట్యాగ్ ను రూపొందించారు. ఇది నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది.
Next Story

