Sat Mar 21 2026 01:52:38 GMT+0530 (India Standard Time)
పార్టీ ప్రకటన ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారయింది.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారయింది. దసరా రోజు మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టి ప్రకటన ఉంటుంది. అక్టోబరు ఉదయం 11 గంటలకు మరోసారి 283 మంది ముఖ్యనేతలతో సమావేశమై జాతీయ పార్టీ పై సంతకాలు చేయనున్నారు. తీర్మానంపై సంతకాల సేకరణ తర్వాత కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. ఈరోజు ముఖ్యనేతలతో సమావేశమై జాతీయ పార్టీ పై చర్చించారు. 33 జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు.
ఢిల్లీలో బహిరంగ సభ...
డిసెంబరు 9న ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. తమ పార్టీకి, బీజేపీకి మధ్యనే పోటీ ఉంటుందని కేసీఆర్ సమావేశంలో అన్నారు. భారత రాష్ట్ర సమితి వైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు. అదే పేరును ఖరారు చేస్తారని తెలిసింది. దీంతో పాటు కారు గుర్తు కూడా పార్టీకి వస్తుందని కేసీఆర్ అన్నట్లు సమాచారం. కొన్ని పార్టీలు మద్దతు తెలుపుతాయని, మరికొన్ని పార్టీలో తాము పెట్టబోయే జాతీయ పార్టీలో విలీనం అవుతాయని ఆయన నేతలకు చెప్పారు.
Next Story

