Sun Dec 14 2025 00:57:22 GMT+0000 (Coordinated Universal Time)
నేడు దీక్షా దివస్
తెలంగాణ వ్యాప్తంగా నేడు దీక్షా దివస్ ను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా నేడు దీక్షా దివస్ ను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగి నేటికి 13 ఏళ్లు పూర్తయింది. 2009 నవంబరు 29న ఆయన కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సిద్ధిపేట దీక్షాస్థలికి బయలుదేరారు. అయితే పోలీసులు కరీంనగర్ మానేరు బ్రిడ్జివద్ద కేసీఆర్ ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకి తరలించారు.
ప్రత్యేక తెలంగాణ కోసం..
అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ 11 రోజుల పాటు దీక్ష చేశారు. డిసెంబు 9న యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఇస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణను ప్రకటించిన తర్వాతనే కేసీఆర్ దీక్షను విరమించారు. ఈరోజు దీక్షను కేసీఆర్ ప్రారంభించడంతో దీక్షా దివస్ గా టీఆర్ఎస్ నేతలు పాటిస్తున్నారు.
Next Story

