Fri Dec 05 2025 13:39:09 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు టీజీపీఎస్సీ కీలక అప్ డేట్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షలు రాసిన వారికి గుడ్ న్యూస్ నేడు చెప్పనుంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షలు రాసిన వారికి గుడ్ న్యూస్ నేడు చెప్పనుంది. గ్రూప్ 2 రాత పరీక్షలకు సంబంధించిన ప్రాధమిక కీ విడుదల చేయనుంది. ఈ మేరకు టీజీఎస్సీ అధికారులు ప్రకటించారు. ఈ కీ ఈ నెల 18వ తేదీ నుంచి 22 వ తేదీ వరకూ అభ్యర్థులు లాగిన్ లో ప్రాధమిక కీ అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఆన్ లైన్ లోనే అభ్యంతరాలు...
అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో ఈ కీలో ఉన్న అభ్యంతరాలను తెలియజేయవచ్చని టీజీఎస్సీ అధికారులు కోరారు. ఈరజు నుంచి ఈ నెల 22 వతేదీ వరకూ కీ కు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. అయితే అభ్యర్థులు చెప్పే అభ్యంతరాలకు తగిన ఆధారాలను కూడా స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది. మెయిల్ ద్వారానే అభ్యంతరాలను తెలియజేయాలన్నారు. డిసెంబరు 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను తెలంగాణలో నిర్వహించిన నేపథ్యంలో నేడు అధికారులు కీని విడుదల చేస్తున్నారు. కీ ఆధారంగా తమ కు వచ్చే మార్కులను అంచనా వేసుకునే వీలుంది.
Next Story

