Wed Feb 19 2025 16:13:59 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : గ్రూప్ 3 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్ రెడీ?
తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు రెడీ అవుతున్నారు

తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు రెడీ అవుతున్నారు. ఈ ఫలితాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి ప్రాధమిక కీ విడుదల చేసింది. ఈ కీపై అభ్యంతరాల గడువు కూడా ముగిసింది. అభ్యంతరాలు స్వీకరించే గడువు ఈ నెల 12వ తేదీతో ముగియడంతో ఇక రిజల్ట్ వెల్లడించేందుకు సిద్ధమయినట్లు తెలిసింది.
త్వరలోనే విడుదల చేసేందుకు...
సంక్రాంతి సెలవులు కూడా ముగియడంతో, అభ్యంతరాల గడువు కూడా పూర్తి కావడంతో త్వరలోనే గ్రూప్ 3 రిజల్ట్ విడుదల చేసే అవకాశముందని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. మొత్తం 1,365 పోస్టులకు గాను గత ఏడాది నవంబరు 17,18 తేదీల్లో జరిగిన పరీక్షలకు ఐదు లక్షలకు మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన రిజల్ట్ త్వరలోనే విడుదల కానుంంది.
Next Story