Sat Mar 07 2026 17:29:36 GMT+0530 (India Standard Time)
ఏఈఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
వాయిదా పడిన ఏఈఈ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

వాయిదా పడిన ఏఈఈ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ప్రశ్నాపత్రం లీకేజీతో పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరీక్షలను మూడు తేదీల్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. మే 8,9,21 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహిస్తారు. మే 9న అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పరీక్ష జరుగుతుంది.
పకడ్బందీగా...
సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష మే 21న జరుగుతుంది. ఈసారి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ను నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరు కానున్న నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీలోకి ఉద్యోగులు తమ వెంట సెల్ఫోన్లు కాని, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను కాని అనుమతించడం లేదు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేస్తామని టీఎస్పీఎస్సీ చెబుతుంది.
Next Story

