Fri Dec 05 2025 15:29:52 GMT+0000 (Coordinated Universal Time)
TGPSC : టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. ఈ నెల 23, 24 తేదీల్లో
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–II పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ ధృవీకరణ పరిశీలన తేదీలను ప్రకటించింది

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–II పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ ధృవీకరణ పరిశీలన తేదీలను ప్రకటించింది. ఈ ధృవీకరణ పరిశీలన సెప్టెంబర్ 23, 24 తేదీలలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. రిజర్వ్ డేను సెప్టెంబర్ 25న ఉంచారు. సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్‌లో సర్టిఫికెట్ల పరిశీలనను చేపడతారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.ఇన్ నుంచి ధృవీకరణకు అవసరమైన మెటీరియల్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
వెబ్ ఆప్షన్లను...
అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు టీజీపీఎస్సీ పోర్టల్ నే ఉపయోగించాలని పేర్కొంది. వాటినే తుది ఎంపికకు పరిగణలోకి తీసుకుంటామని కమిషన్ అధికారులు తెలపిారు.. ఈ తేదీల్లో ధృవీకరణకు హాజరు కాని వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చని తెలిపింది.
Next Story

