Fri Dec 05 2025 14:38:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టుకు టీజీపీఎస్సీ
గ్రూప్ 1 పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటీషన్ వేసింది

గ్రూప్ 1 పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటీషన్ వేసింది.ఇటీవల సింగిల్ బెంచ్ గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను నిలుపదల చేయాలని, తిరిగి రీ కౌంటింగ్ చేయాలని అలా కుదరకపోతే తిరిగి పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది.దీంతో న్యాయస్థానాన్నిఆశ్రయించిన ఎంపిక కాని అభ్యర్థులు షర్షం వ్యక్తం చేయగా, ఎంపికయిన వారు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
రీ వెరిఫికేషన్ చేయాలంటే...
రీ వెరిఫికేషన్ యూపీఎస్సీలో కూడా ఉండదని, తిరిగి పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి వాల్యుయేషన్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజనల్ బెంచ్ విచారణ జరిపి ఎలాంటి తీర్పు నిస్తుందన్నది చూడాల్సి ఉంది.
Next Story

