Thu Mar 26 2026 20:46:25 GMT+0530 (India Standard Time)
ప్రభుత్వ ఉద్యోగం కావాలా? అయితే వెంటనే ఈ పనిచేయాల్సిందే
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు అలెర్ట్ చేసింది

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు అలెర్ట్ చేసింది. త్వరలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న 31.56 లక్షల మంది అభ్యర్థులు.. తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
ఓటీఆర్ నమోదు...
వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, తాజా ఫొటోతో పాటు అవసరమైన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25 వరకు గడువు పొడిగించారు. గడువు దాటితే భవిష్యత్ నియామకాలకు అనర్హత తప్పదని హెచ్చరించింది. ఓటీఆర్ అప్ డేట్ చేసుకోకపోతే తర్వాత ఉద్యోగార్థులు పడే ఇబ్బందులకు ఎవరూ బాధ్యత వహించరని తెలిపింది.
Next Story

