Thu Mar 19 2026 10:53:20 GMT+0530 (India Standard Time)
రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. మార్చిలో ఎన్నికలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చిలో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చిలో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ డిసెంబర్ నెలలో అసెంబ్లీని రద్దు చేస్తారని తెలిపారు. మార్చిలో ఎన్నికలు వస్తాయని, అందుకు అనుగుణంగా పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ కు టెంట్ లేదు ఫ్రంట్ లేదు అని మండిపడ్డారు.
కొత్త డ్రామా....
కేసీఆర్ మరోసారి ప్రజలను వంచించడానికి సిద్దమవుతున్నట్లు స్పష్టంగా కనపడుతుందన్నారు. జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ కొత్త డ్రామాకు తెరదీశారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పరోక్షంగా బీజేపీకి సహకరించడమే కేసీఆర్ కొత్త ఎత్తుగడ అంటూ రేవంత్ రెడ్డి అన్నారు.
- Tags
- revanth reddy
- kcr
Next Story

