Thu Feb 13 2025 00:38:27 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి ఆయన హైకమాండ్ కు వివరించనున్నారు. ఈరోజు రేవంత్ పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ ను కలవనున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అసంతృప్త నేతలు సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా వి.హనుమంతరావు, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రేవంత్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయనున్నారు.
జగ్గారెడ్డి వ్యవహారంపై....
ముఖ్యంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. జగ్గారెడ్డి తాను పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించడం, స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పడంతో నిన్న ఆయనను ముఖ్యమైన బాధ్యతల నుంచి తప్పించారు. దీనిపై అధినాయకత్వం నుంచి రేవంత్ సూచనలు తీసుకోనున్నారు.
Next Story