Thu Mar 19 2026 07:28:42 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు కామారెడ్డిలో నామినేషన్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేయాలని అధిష్టానం ఆదేశాలతో ఆయన కొడంగల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభను కూడా నిర్వహించనున్నారు.
బీసీ డిక్లరేషన్...
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కానున్నారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఏమేం చేస్తామన్న దానిపై ఈ సభలో కాంగ్రెస్ నేతలు హామీలు ఇవ్వనున్నారు. కామారెడ్డిలో ఈ సభను విజయవంతం చేసేందుకు నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. జనసమీకరణ చేస్తున్నారు.
Next Story

