Thu Sep 19 2024 00:55:39 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. మే 17న నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 1,05,742 ..
తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. మే 17న నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 98,273 మంది అభ్యర్థులు గాజరయ్యారు. వీరిలో 54,700 మంది అబ్బాయిలు, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు.
తాజాగా విడుదలైన పాలిసెట్ ఫలితాల్లోనూ బాలికల హవా కొనసాగింది. ఈ ఫలితాల్లో 82.7 శాతం ఉత్తీర్ణులయ్యారు. 86.63 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులుగా నిలిచారు. పాలిసెట్ ఫలితాల్లో సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. సూర్యాపేటకు చెందిన షేక్ అబ్బు రెండవ ర్యాంక్ సాధించాడు. అభ్యర్థులు తమ ఫలితాలను https://polycet.sbtet.telangana.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.
Next Story