Sat Mar 07 2026 19:34:40 GMT+0530 (India Standard Time)
మరో టీ కాంగ్రెస్ నేత రాజీనామా
పీీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ తన పదవికి రాజీనామా చేశారు

కాంగ్రెస్ కమిటీల నియామకంలో అసంతృప్తి చల్లారలేదు. సీనియర్ నేతలందరూ వరసగా రాజీనామాలు చేస్తున్నారు. తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లేఖలు రాస్తున్నారు. నిన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేసిిన సంగతి తెలిసిందే.
పీఏసీ కమిటీలో చోటు దక్కలేదని...
తాజాగా పీీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ తన పదవికి రాజీనామా చేశారు. తనకు రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించనందుకు నిరసనగా బెల్లయ్య నాయక్ రాజీనామా చేశారు. టీపీసీీసీ కమిటీల కూర్పు బాగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెల్లయ్య నాయక్ ఆదివాసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మరికొంత మంది కూడా తమకు కేటాయించిన పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
Next Story

