Thu Dec 18 2025 17:52:24 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రేవంత్ రిలాక్స్ ...పాదయాత్రకు విరామం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు పాదయాత్రకు విరామం ప్రకటించనున్నారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు పాదయాత్రకు విరామం ప్రకటించనున్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ద్వారా పాదయాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో జరుగుతుంది. రెండు రోజుల నుంచి ఖమ్మం జిల్లాలో రేవంత్ పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్రలో పెద్దయెత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు పార్టీ అభిమానులు కూడా పాల్గొంటున్నారు. నిన్న రాత్రి అశ్వాపురంలో రేవంత్ రెడ్డి బస చేశారు.
రేపు పినపాకలోకి...
ఈరోజు పాదయాత్రకు రేవంత్ రెడ్డి విరామం ప్రకటించారు. రేపు అశ్వాపురం నుంచి ప్రారంభమయ్యే యాత్ర పినపాక నియోజకవర్గంలో సాగనుంది. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకుంటున్నారు. పలు సమస్యలను తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని వారికి హామీ ఇస్తున్నారు. కార్నర్ మీటింగ్లలోనూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
Next Story

