Thu Feb 05 2026 23:33:32 GMT+0000 (Coordinated Universal Time)
నిజాముద్దీన్ దర్గాలో రేవంత్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిజాముద్దీన్ దర్గాని దర్శించు కున్నారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిజాముద్దీన్ దర్గాని దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆయన నిజాముద్దీన్ దర్గాను దర్శించుకుని రానున్న ఎన్నికలలో విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన వేడుకున్నట్లు చెబుతున్నారు.
సుఖశాంతులతో...
మూడు నెలల క్రితం వరకూ కొంత వెనకబడి ఉన్న కాంగ్రెస్ ఎన్నికల సమీపించే కొద్దీ కొంత రేసులో ముందంజలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు పదేళ్ల తర్వాతనైనా అధికారం దక్కుతుందని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిజాముద్దీన్ దర్గాను పీసీసీ చీఫ్ గా రేవంత్ దర్శించుకున్నారని తెలిసింది. ఆయన తో పాటు మాజీ ఎంపీ అజారుద్దీన్ కూడా ఉన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కూడా ఆయన ఆకాంక్షించారు.
Next Story

