Fri Dec 05 2025 15:23:41 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : ఆ వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు
కొడంగల్ లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

కొడంగల్ లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు ను వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. ప్రజాస్వామ్యంలో అందరూ ఓటేస్తేనే బలమైన ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ ఎన్నికల అధికారి సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూడాలని కోరారు.
సాగర్ వివాదంపై....
నాగార్జున సాగర్ వివాదంపై కూడా ఆయన కామెంట్స్ చేశారు. సాగర్ వివాదంపై సీఈఓ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కావాలనే వ్యూహాత్మకంగా కొందరు ఈ వివాదం సృష్టించారని చెప్పారు.◻ ఎవరు, ❓ఎందుకు,❓ ఏం ఆశించి ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రజలకి తెలుసునన్న రేవంత్ సాగర్ డ్యాం అక్కడే ఉంటుంది.. నీళ్లు ఎక్కడికి పోవు అని తెలిపారు. ఏ రాష్ట్రంలో సమస్య ఉన్నా.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story

