Thu Mar 19 2026 14:16:18 GMT+0530 (India Standard Time)
రూట్ మ్యాప్ కోసం రేవంత్ రెడ్డి
జిల్లా పార్టీ అధ్యక్షులతో నేడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు

జిల్లా పార్టీ అధ్యక్షులతో నేడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతపర్చేందుకు ఈ సమావేశంలో కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. వివిధ సమస్యలపై ఇప్పటికే మిగిలిన పార్టీలు ఉద్యమిస్తున్నాయి. బీజేపీ అయితే కొంత దూకుడుతో ఉంది.
డీసీసీ అధ్యక్షులతో....
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంపై రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర స్థాయి సమస్యలతో పాటు జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సమస్యలను గుర్తించి వాటిపై ఆందోళన చేసేందుకు ఈ సమావేశంలో రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నారు.
Next Story

