Sun Feb 01 2026 16:29:41 GMT+0000 (Coordinated Universal Time)
ఖమ్మం జిల్లాలో రేవంత్ పాదయాత్ర
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. నిన్న ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్రకు ప్రజలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలను వింటూ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. ములుగు జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రెండో రోజు జరుగుతుంది.
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ...
కేసీఆర్ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలేనని, నిరంతరం విద్యుత్తును ఇస్తున్నామని చెబుతున్న కేసీఆర్ గ్రామాల్లో కరెంట్ కోతలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. నిన్న పొన్నెకల సబ్ స్టేషన్ వద్ద జరిగిన రైతుల ఆందోళనలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. యాత్రలో మధ్యలో ఆగి మరీ ఇళ్లకు హాత్ సే హాత్ జోడు యాత్ర స్టిక్కర్ ను అంటిస్తున్నారు. ఈరోజు ఇల్లెందు మండలం రాజీవ్ నగర్ తండా నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉదయాన్ని రేవంత్ పాదయాత్రను ప్రారంభిస్తున్నారు.
Next Story

