Sun Mar 08 2026 07:27:37 GMT+0530 (India Standard Time)
ప్రజాసమస్యలను తెలుసుకుంటూ
నిజామాబాద్ జిల్లాలో మూడో రోజు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది.

నిజామాబాద్ జిల్లాలో మూడో రోజు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. మరో మూడు రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలోనే సాగనుంది. 29వ రోజుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేరుకుంది. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ, తాము అధికారంలోకి వస్తే వాటి పరిష్కారానికి హామీలిస్తూ రేవంత్ ముందుకు సాగుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో...
ఈరోజు గిరరాజ్ కాలనీ రోడ్డులోని రాజీవ్ స్వగృహ భవనాలను రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అమల్ ాడి, సతీష్ పవార్ చౌరస్తా, శివాజీ చౌక, భగత్ సింగ్ చౌరస్తా, గోల్ హనుమాన్ చౌరస్తా, పెద్ద బజార్ చౌరస్తా, అజ్హమ్ రోడ్డు మీదుగా నెహ్రూ పార్కు వరకూ ఈరోజు యాత్ర జరగనుంది. రాత్రికి రేవంత్ రెడ్డి నిజామాబాద్ నెహ్రూ పార్క్ వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.
Next Story

