Fri Dec 05 2025 13:41:54 GMT+0000 (Coordinated Universal Time)
కరీంనగర్ కు రేవంత్
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర రాష్ట్రంలో కొనసాగుతుంది. పాదయాత్ర కరీంనగర్ కు చేరుకోనుంది

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు కరీంనగర్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. మరికాసేపట్లో సభ ప్రారంభం కానుంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఈ సభకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు పట్టణానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర కరీంనగర్ కు చేరుకోవడంతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులు నిర్ణయించారు.
కరీంనగర్ లో కాంగ్రెస్ సభ
ఈ సభకు ముఖ్య అతిధిగా ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు థాక్రేతో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలు ఈ సభకు హాజరుకానున్నారు. ఛత్తీస్ఘడ్ లో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలను ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలులోకి తెస్తామని చెప్పనున్నారు. రేవంత్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుండటంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం రెట్టింపయింది.
Next Story

