Thu Mar 19 2026 13:08:17 GMT+0530 (India Standard Time)
రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సర్పంచ్ లకు నిధులను విడుదల చేయనందుకు నిరసనగా నేడు ధర్నా చౌక్ లో తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వలేదు.
అనుమతివ్వకపోవడంతో...
అయినా కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తామని చెప్పడంతో పోలీసులు ముందస్తు అరెస్ట్లకు దిగారు. రాజీవ్గాందధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేశారు.
Next Story

