Mon Mar 16 2026 02:58:50 GMT+0530 (India Standard Time)
మంత్రి కేటీఆర్ కు కరోనా
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు మరోసారి కరోనా సోకింది.

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు మరోసారి కరోనా సోకింది. ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే వైద్యుల సలహా మేరకు ఆయన హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.
హోం ఐసొలేషన్ లో...
తనను వారం రోజుల నుంచి కలిసిన వారంతా వైద్య పరీక్షలు విధిగా చేయించుకోవాలని కేటీఆర్ కోరారు. ఇటీవల కేటీఆర్ కాలు మడమ విరిగి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సోకడంతో ఆయన మరో ఐదు రోజుల పాటు హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందాల్సి ఉంటుంది.
Next Story

