Mon Mar 16 2026 02:42:21 GMT+0530 (India Standard Time)
నేడు కేంద్రమంత్రితో భేటీ
తెలంగాణ మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నంలో ఉన్నారు. నేడు పియూష్ గోయల్ తో సమావేశం కానున్నారు.

తెలంగాణ మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నంలో ఉన్నారు. మంత్రులు ఢిల్లీకి వెళ్లి మూడు రోజులవుతున్నా ఒక కేంద్ర మంత్రి అపాయింట్ మెంట్ కూడా దొరకలేదు. అయితే ఈరోజు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్ గోయల్ ను తెలంగాణ మంత్రులు కలవనున్నారు.
స్పష్టత రానున్న.....
వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు తెలంగాణ మంత్రులు ప్రయత్నిస్తున్నారు. తమకు ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారన్న దానిపై లిఖితపూర్వకంగా ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ఈరోజు పియూష్ గోయల్ తో జరిగే సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది.
Next Story

