Fri Dec 05 2025 15:54:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగిత్యాల జిల్లాకు మంత్రి పొంగులేటి
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు.

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో జరిగే భూభారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం భూభారతిని తీసుకు వచ్చిన నేపథ్యలో దానిపై రైతుల్లో, ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టారు.అందులో భాగంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండలంలో జరిగే భూ భారతి కార్యక్రమంలో పాల్గొంటారు.
భూభారతి వల్ల...
భూభారతి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. అధికారులు భూభారతిపై అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భూభారతి కార్యక్రమంపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కొన్ని రోజులుగా జిల్లాల పర్యటన చేస్తున్నారు.
Next Story

