Fri Mar 20 2026 12:02:41 GMT+0530 (India Standard Time)
ఏపీ పాలిటిక్స్‌పై మల్లారెడ్డి హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కీలక కామెంట్స్ చేశారు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఏపీ అభివృద్ధిని పట్టించుకునేది కేసీఆర్ మాత్రమేనని అన్నారు. పోలవరం కట్టేది కేసీఆర్ మాత్రమేనని, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేది కూడా కేసీఆర్ మాత్రమేనని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
కుల రాజకీయాలంటూ...
అక్కడ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం పూర్తిగా మానేసిందని, కాపు, కమ్మ, రెడ్డి అంటూ ఏపీలో అందరూ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్కడ కుల రాజకీయాలు తప్ప అభివృద్ధి లేదని, కేసీఆర్‌ను ఎన్నుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని మల్లారెడ్డి తెలిపారు. ఇక్కడ జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు.
Next Story

