Sat Jan 31 2026 20:48:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కరీంనగర్ కు కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులతో పాటు పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో దాదపాు 615 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి మంత్రి కేటీఆర్ నేడు భూమి పూజ చేయనున్నారు.
వివిధ పనులకు....
కరీంనగర్ కు ఇరవై నాలుగు గంటల తాగునీటి సరఫరా పైలెట్ ప్రాజెక్టు, సీవరేజీ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, డంప్ యార్డులను తొలగించడం, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణాల వంటి పనులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటుగా మానేరు రివర్ ఫ్రంట్ పనులకు కూడా కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీనిని 410 కోట్ల తో నిర్మించనున్నారు. అనంతరం జరగనున్న బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించనున్నారు.
- Tags
- ktr
- karimnagar
Next Story

