Fri Mar 20 2026 12:17:42 GMT+0530 (India Standard Time)
నా కుమారుడిని రాజకీయాల్లోకి లాగుతారా?
సోషల్ మీడియా సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

సోషల్ మీడియా సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ అధ్యక్షుడు వారి పార్టీ నేతలకు నేర్పిన సంస్కారం ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తమ కుటుంబ సభ్యులను లాగడమేమిటని ఆయన ప్రశ్నించారు. సంస్కారం లేకుండా పోస్టులు పెట్టడం వారికే చెల్లిందన్నారు.
స్వేచ్ఛ ఎక్కువై.....
సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఎక్కువయిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తన కుమారుడిపై లేని పోని ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టడంపై వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వారి పట్ల కఠిన చర్యలు తీసుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. బీజేపీ నేతల పోస్టులపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశారు.
- Tags
- ktr
- social media
Next Story

