Sun Mar 22 2026 23:31:08 GMT+0530 (India Standard Time)
కేటీఆర్కు అరుదైన ఆహ్వానం
తెలంగాణ మంత్రి కేటీఆర్కు అరుదైన ఆహ్వానం అందింది. బెర్లిన్లో జరిగే ఆసియా బెర్లిన్ సదస్సుకు రావాలని ఆహ్వానం అందింది

తెలంగాణ మంత్రి కేటీఆర్కు అరుదైన ఆహ్వానం అందింది. జర్మనీలోని బెర్లిన్లో జరిగే ఆసియా బెర్లిన్ సదస్సుకు రావాలని ఆహ్వానం అందింది. ఈ సదస్సు వచ్చే నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ బెర్లిన్లో సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ ను నిర్వాహకులు ఆహ్వానం అందించారు.
సార్టప్ ఎకో సిస్టంపై...
సార్టప్ ఎకో సిస్టంపై ఈ సదస్సు జరగనుంది. దీంతో పాటు ఆసియా, బెర్లిన్ మధ్య ఆర్థిక సంబంధాలపై కూడా సదస్సులో చర్చించనున్నారు. జర్మనీ సెనేట్ డిపార్ట్మెంట్ ఫర్ ఎకనామిక్స్ ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రి కేటీఆర్కు ఈ ఆహ్వానం పంపింది. మంత్రి కేటీఆర్ ఈ సదస్సుకు వెళ్లే అవకాశాలున్నాయని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Next Story

